నూజివీడు నియోజకవర్గ చిరంజీవి యువత నూతన కమి టీని నియమించినట్లు ఉమ్మడి కృష్ణాజిల్లా బ్లడ్ డోనార్స్ క్లబ్ కో కన్వీనర్ ముమ్మలనేని సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల గౌరవాధ్యక్షుడు, యువత వ్యవస్థాపక అధ్యక్షుడి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా యర్రంశెట్టి రాము, నూజివీడు టౌన్ అధ్యక్షుడిగా షేక్ బాజీ నియమితులైనట్లు పేర్కొన్నారు.