ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వచ్చంద సంస్థల సహకారం మరువలేనిదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భారీవర్షాలు, వరద కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు నూజివీడులోని వెలమపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిత్యావసర సరుకులను మంత్రి అందజేశారు. వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు దాతలు సుమారు లక్షల 30 వేల నగదును మంత్రికి అందజేశారు.