చాట్రాయి మండల పరిషత్ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చాట్రాయి ఎంపీపీ లంక నిర్మల జెండాను ఎగరవేశారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుక అని ఆమె అన్నారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ఎంపీడీవో కె దుర్గాప్రసాద్, ఎంఈఓ బ్రహ్మచారి, ఏవో ఎన్ మురళీమోహన్ సీనియర్ అసిస్టెంట్ సీతారామారావు మండల పరిషత్ సిబ్బంది జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.