నూజివీడు మండలం తుక్కులూరు శివారు మరికుంట గ్రామంలో పంచాయతీ రోడ్లు అద్వానంగా మారాయి. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం నూజివీడు ఎండిఓ రాఘవేంద్ర నాథ్ ఆధ్వర్యంలో అధికారులు ఈ పంచాయతీ రోడ్లను పరిశీలించారు. ఈ రోడ్లో నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను వేడుకున్నారు. సమస్యలను ప్రజలు వివరించారు. ఎండిఓ తో పాటు పంచాయతీ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.