అక్రమ మట్టి రవాణా చేస్తున్న వైనంపై గురువారం రెవిన్యూ శాఖ అధికారులు దాడి చేశారు. ముసునూరులోని సూరేపల్లిలో గల ఆకుల రామయ్య చెరువులో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న జెసిబి ని రెవెన్యూ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు రావడంతో తహసిల్దార్ కె. రాజ్ కుమార్ పర్యవేక్షణలో రెవిన్యూ శాఖ సిబ్బంది అక్రమ మట్టి రవాణా చేస్తున్న చెరువు వద్దకు వెళ్లి జెసిబి ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు.