శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.