చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో వైరల్ జ్వరాలపై అపోహలు తొలగించడానికి నిర్వహించిన అవగహన సభలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి శనివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా వైరల్ జ్వరాల వలనే మరణాలు సంభవించాయన్న తప్పుడు సమాచారంపై అపోహలు వీడి వాస్తవాలు తెలుసుకోవాలని గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానన్నారు.