బంగ్లాదేశ్ లో మైనార్టీలు, ప్రధానంగా హిందువులపై జరుగుతున్న పైశాచిక దాడికి నిరసనగా ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు గాదె వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. హిందూ సంస్థలు, హిందూ బంధువులు, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గాంధీ బొమ్మల సెంటర్ నుండి ప్రదర్శన ప్రారంభమవుతుంది.