వైసీపీ హయాంలో నిధులు దారిమళ్లించి పురపాలక సంఘాలను నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళవారం పాలకొల్లులో అభివృద్ధి పనులపై మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. "గత ఐదేళ్లల్లో చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలపై భారం మోపిన చెత్త పాలన చూశాంజగన్ చెత్త పాలనతో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు." అని మండిపడ్డారు.