పాలకొల్లు లయన్స్ క్లబ్బులో శనివారం లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డితో కలిసి మంత్రి రామానాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కోసి అందరికీ పంచారు. ప్రపంచవ్యాప్తంగా అంధులకు లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు బ్రెయిలీ అని మంత్రి అన్నారు.