యలమంచిలి మండలం కనకాయలంకలో వరద ప్రభావానికి నీట మునిగిన నివాసాలను శనివారం పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ పడవపై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యాధుల ప్రబలకుండా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.