పామర్రు: వృద్ధురాలు దారుణ హత్య
వృద్ధురాలు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం పామర్రు నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. పెదపారుపూడి మండలం దూళ్ళవానిగూడెంలో వేమూరి వేంకటేశ్వరరావు అనే వృద్ధుడు వృద్ధురాలైన భార్యవేమూరి లక్ష్మీబాయమ్మను చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మృతదేహాన్ని గోనె సంచుల్లో చుట్టి రోడ్డుపై ఈడ్చి కెళుతుండగా చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.