పెడన: పెళ్లి చేసుకున్న 18ఏళ్ల అమ్మాయి, 19ఏళ్ల అబ్బాయి
19ఏళ్ల అబ్బాయి, 18ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకున్న ఘటన పెడనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం మండలంలోని నందిగామకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకొని పెడన పోలీస్ స్టేషనుకు చేరుకున్నారు. చట్ట ప్రకారం వరుడికి 21 సం. లు ఉండవలసి ఉండగా 19 సం. లు కావడంతో పోలీసులు అంగీకరించలేదు. అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, అతను ఇంటరుతో ఆపివేసినట్లు తెలిసింది. ఎస్ఐ ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు.