ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరుపుకోవాలి
ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని బంటుమిల్లి ఎస్ఐ గణేష్ నిర్వాహకులకు సూచించారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని ముంజులూరు గ్రామంలోని విగ్రహాలను ఊరేగింపు నిర్వహిస్తున్న నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీజేలు పెట్టడానికి అనుమతులు లేవని, వివిధ పార్టీలను రెచ్చగొట్టేలా పాటలు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.