పెడన పట్టణంలో ఇసుక ట్రాక్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీలను తప్పించుకొని అక్రమ మార్గంలో పలువురు వ్యాపారులు ఇసుకను భారీగా నిర్మాణ రంగానికి తరలిస్తున్నారు. పెడన సరిహద్దున ఉన్న కట్టపల్లి, కాకర్లమూడి ప్రాంతాల్లో ఇసుక రీచ్ లు ఉన్నాయి. అక్కడి నుంచి మచిలీపట్నానికి ఇసుకను తరలిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు స్పందించడం లేదంటున్నారు.