భారత్ బంద్ ముసుగులో ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బంధంచర్ల గ్రామంలో హోటల్ నడుపుతున్న వెంకట లక్ష్మి అనే మహిళా పై ఆమె కుటుంబ సభ్యుల పై దాడి జరిగింది. బుధవారం ఉదయం హోటల్ నడుపుతుండగా బైక్ పై వచ్చి హోటల్ మూసి వేయాలని చెప్పారు. ఒక అర్ద గంటలో మూసి వేస్తానని మహిళా చెప్పగా వెంటనే ఆమె కుమారుడి పై దాడి చేశారు. అడ్డుగా వెళ్లిన ఆమె పై, ఆమె కుటుంబ సభ్యుల పై కట్టలతో, కత్తులతో దాడి చెశారు. కావాలనే తమని లక్ష్యంగా చేసుకొని 20 మంది దాడి చేసారని అందులో 7 గురు దారుణంగా కొట్టారని దాడి చేసిన వారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అని మహిళా వాపోయారు. ఉదయం 8: 30 కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే సాయంత్రం 5 గంటలకు తమ ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన కుమారుడి పై దాడి చేసి తిరిగి అతని పైనే కేసు పెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.