బయన్నగూడెంలో కారు ప్రమాదం

80చూసినవారు
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం శివారులో బుదవారం కారు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ వైపు వెళుతున్న కారు బయ్యనగూడెం శివారు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ కు ఒక్కసారిగా నిద్రమత్తు రావడంతో అదుపుతప్పి కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. వెంటనే కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసం అయింది.

సంబంధిత పోస్ట్