టి. నరసాపురం మండలం ఏపీగుంట ప్రాథమిక పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం పొందుతున్న స్వేచ్ఛ అని అన్నారు.