ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామ శివారులో శనివారం రాత్రి అదుపుతప్పి ఒక లారీ తుప్పల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా లారీ అదుపుతప్పి రహదారికి అవతల వైపుకు దూసుకువెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.