ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడంతో పాటు ప్రజల్లో నమ్మకం నింపడానికి శనివారం కేంద్ర బలగాలు ములగలంపల్లి గ్రామంలో కవాతు శనివారం నిర్వహించారు. సిబ్బంది పలు వీధుల్లో కవాతు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉన్నందునా. వారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడానికే కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ టీ.క్రాంతి కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.