రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోలవరం టిడిపి ఇన్చార్జి, ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మంగళవారం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ సహకారాన్ని అందజేయాలని, అందుకు తగ్గట్టుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ గిరిజనుల, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్దికి సహకరించాలన్నారు.