దర్శిపర్రు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
దర్శిపర్రు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అలాగే, స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 12 మంది దేశ నాయకుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఫిల్టర్ బెడ్ రీఛార్జ్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కోలా శేష వేణి, జనసేన మండల అధ్యక్షుడు పుల్లా బాబి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్