తాడేపల్లిగూడేం: గవర్నర్ కు అవార్డులను సమర్పిస్తా

61చూసినవారు
తాడేపల్లిగూడేం: గవర్నర్ కు అవార్డులను సమర్పిస్తా
తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాధపురంలో వివాహిత హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న తనపై రూరల్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని గురజాడ ఆనంద్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాతీయ యువజన అవార్డు, డాక్టరేట్ పట్టాను గవర్నర్ కు తిరిగి సమర్పించనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్