
తాడేపల్లిగూడెం: వెంకట రమణకు ఉగాది పురస్కారం అందజేసిన కలెక్టర్
భీమవరం విష్ణు కళాశాలల ఆవరణలో ఆదివారం జిల్లా స్థాయి ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు సూరంపూడి వెంకటరమణను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సన్మానించారు. ఐదున్నర దశాబ్దాలుగా వెంకటరమణ కళారంగానికి చేస్తున్న సేవల నిమిత్తం ఈ పురస్కారం అందజేశారు.