తాడేపల్లిగూడెం: ఆర్టీసీ కార్గోతో రూ.190 కోట్లు ఆదాయం
ఆర్టీసీ కార్గో ద్వారా ఇప్పటివరకు రూ. 190 కోట్లు ఆదాయం లభించిందని పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో ఏటీఎం (కమర్షియల్) జీఎల్ బీవీ సుబ్బారావు తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ. 300 కోట్లు ఆదాయ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. త్వరలో డోర్ పిక్ అప్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డీఎం వై. సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.