
పెదతాడేపల్లిలో ఈ నెల 9న జాబ్ మేళా
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి లోటస్ స్కూల్లో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకుడు బొలిశెట్టి రాజేష్ తెలిపారు. గురువారం జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దాదాపు 60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతారని తెలిపారు. నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరారు.