

తాడేపల్లిగూడెం: కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల మూడవ రోజు ఉత్సవాలు బుధవారం జరిగాయి. వెలవలపల్లి బాల సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రహ్మత్వంలో యాగశాల ప్రదక్షిణ, గణపతి పూజ, దీక్షధారణ, హోమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ల గోపికృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 2న విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నారు.