ఇటీవల కోల్ కత్తా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని హత్య పట్ల తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ కుడారి ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఎంవీ సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు ఇటీవల కాలంలో వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు.