పాలకోడేరు మండల పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎస్సై మంతెన రవి వర్మ తమ సిబ్బందికి బుధవారం స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు.నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది గురించి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరక్కుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిబాబు, ఏఎస్ఐ మోహన్ రావు, రైటర్ సిబ్బంది పాల్గొన్నారు.