జన హృదయనేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ మేరకు పాలకోడేరు మండలంలో వైయస్సార్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ పార్టీ నాయకులు కొత్తపల్లి కాశి విశ్వనాథరాజు, కొత్తపల్లి సుధీర్ రాజు, కునాదరాజు రంగరాజు, కునాదిరాజు, కృష్ణంరాజు, కునాదరాజు రామచంద్రరాజు, గాదిరాజు వెంకన్న, ఎస్. కే. రామరాజు, గొట్టు ముక్కల సుబ్బరాజు, మామిడి శెట్టి లక్ష్మణ్ తదితర వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.