
కాళ్లకూరు వెంకన్నను దర్శించుకున్న జనసేన నేతలు
కాళ్ళ మండలం కాళ్లకూరు గ్రామంలో వెంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.