భీమడోలు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవ్వగా. వారిని రోడ్ సేఫ్టీ సిబ్బంది భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.