ఆరోగ్యవంతమైన సమాజం ప్రజల చేతుల్లో ఉంది

54చూసినవారు
ఆరోగ్యవంతమైన సమాజం ప్రజల చేతుల్లో ఉందని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ మలేరియా అధికారి వై వి లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో ఆరోగ్య కార్యక్రమాల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు దోమలద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకువ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కే. శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్