భీమడోలు మండలం గుండుగొలను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చేర్మన్ గా గంధం లక్ష్మణ్, ఉప చైర్మన్ గా డోకల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంధర్భంగా వారికి ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యంగా నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూసుకోవాలని అలాగే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.