ఏలూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం భీమడోలు పీఎస్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కిరణ్ మరో ఇద్దరితో కలిసి నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ప. గో. జిల్లాలో 42 చోరీలకు పాల్పడ్డారు. భీమడోలు సీఐ విల్సన్ నేతృత్వంలో ముగ్గురిని అరెస్ట్ చేసి రూ. 3 లక్షల విలువగల నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.