స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకొని భీమడోలు మండలం తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.