విజయవాడ వరద బాధితుల సహాయార్ధం భీమడోలు మండల జనసేనపార్టీ అధ్యక్షులు ప్రత్తి మధన్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం వాటిని తరలించే వాహనాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పార్టీ శ్రేణులు ఆర్ధిక సహాయంతో సమకూర్చిన వాటిని వరద బాధితులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.