విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయటంతో పాటు, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం నారాయణపురంలో
ఉంగుటూరు మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంటర్, టెన్త్ మెరిట్ విద్యార్థులకు, మెమొంటో, నగదు అందజేసి సన్మానం చేశారు. ఎంపీటీసీ సభ్యులు బండారు నాగరాజు, ఆ సంఘం అధ్యక్షులు శంకరాచారి, తదితరులు పాల్గొన్నారు.