విజయవాడ: సైడ్ డ్రెయిన్ పనులు ప్రారంభం
విజయవాడ 49వ డివిజన్ పరిధిలోని పెనుమాక దేవదాసు వీధిలో బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానిక మహిళలతో కలిసి సోమవారం సైడ్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాల మేరకు నాలుగున్నర లక్షల వ్యయంతో పెనుమాక దేవదాసు వీధిలోని సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.