
విజయవాడ: ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం
దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి ఓటు హక్కు వినియోగం ఎంతో ముఖ్యమని, దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 15 వ జాతీయ ఓటర్ల దినోత్స ప్రత్యేక కార్యక్రమం జరిగింది.