టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందే: వర్ల రామయ్య

53చూసినవారు
టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాల్సిందే: వర్ల రామయ్య
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తనపై వచ్చిన వివాదం పట్ల వివరణ ఇచ్చారు. దీనిపై టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. 'మీరు పార్టీ గీత దాటుతున్నారు.. మీ వ్యవహార శైలి సరిగా లేదు' అని క్రమశిక్షణ కమిటీ నేడు కొలికపూడికి స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. టీడీపీలో ఎవరైనా ఒకటేనని.. క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్