స్విట్జర్లాండ్‌లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉంది. నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఏపీ ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం AP విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు.