వేసవిలో ఆయిల్ పామ్ పంట మొక్కలు, చెట్లకు మెగ్నీషియం, బోరాన్ పోషకాలను అందించాలి. తొలి ఏడాది మొక్కకు 125 గ్రాముల మెగ్నీషియం, 50 గ్రాముల బోరాన్ అందించాలి. రెండో ఏడాది మొక్కకు 250 గ్రాముల మెగ్నీషియం, 100 గ్రాముల బోరాన్ అందించాలి. మూడో ఏడాది మొక్కకు 500 గ్రాముల మెగ్నీషియం, 100 గ్రాముల బోరాన్ అందించాలి. మెగ్నీషియం, బోరాన్‌లను ఎరువులతో కలుపుకోకుండా విడిగా ఒక వారం తర్వాత డ్రిప్ ద్వారా అందించాలి.