AP: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడంతో పాటు శిక్షణ కూడా ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ముందుగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. మొదటి విడతలో లక్ష కుట్టు మిషన్లు అందజేయనుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మహిళల వయసు 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులు https://apobmms.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.