ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ ప్రణాళిక త్వరలో అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాల పరిధిలోని 15 గ్రామీణ బ్యాంకులను విలీనం చేయనున్నారు. ఒకప్పుడు 196 ఉన్న గ్రామీణ బ్యాంకులు 43కు కుదించబడ్డాయి. తాజాగా అవి 28కి తగ్గించనున్నారు. ఏపీలో వేర్వేరు పేర్లతో ఉన్న 4 గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు ఏపీ గ్రామీణ బ్యాంక్‌గా మారబోతున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.