అమరావతి రైతులకు గుడ్‌ న్యూస్

75చూసినవారు
అమరావతి రైతులకు గుడ్‌ న్యూస్
అమరావతి రైతులకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. రాజధానిలో పనులకు సంబంధించి ఒక్కొక్కటిగా టెండర్లను ఆహ్వానిస్తోంది. తాజాగా అమరావతి కోసం భూముల్ని ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో సౌకర్యాల కోసం బిడ్లను ఆహ్వానించింది. రిటర్నబుల్‌ ప్లాట్లలో మౌలిక వసతుల కోసం ఈ నిధుల్ని సీఆర్డీఏ కేటాయిస్తోంది. అమరావతిలోని మూడు జోన్లలో రూ.6,595.50 కోట్లతో ఎల్పీఎస్‌ లే అవుట్లలో కనీస వసతుల కల్పన కోసం కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్