AP: ఉగాది నుంచి రాష్ట్రంలో 'పీ4' విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. "ప్రతి నియోజకవర్గంలో ఈ విధానాన్ని అమలు చేస్తాం. పేదల కోసం ప్రత్యేకంగా జాబితా తయారు చేసి, వారికి మద్దతుగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం" అని వివరించారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.