జర్నలిస్టుల పై సీనినటుడు మోహనబాబు దాడిని హేయమైన చర్యగా జర్నలిస్టు సంఘాలు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మీడియాపై సినీ నటుడు మోహన్‌బాబు దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా ఏపీయూడబ్య్లూజే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సూచనల మేరకు అనుబంధమైన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన అనంతరం ర్యాలీగా తహసిల్దార్ హుస్సేన్‌కు వినతి పత్రం అందించారు.