గుంటూరు: నేడు క్యాన్సర్ అవగాహన ర్యాలీ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం 'జాతీయ క్యాన్సర్ అవగాహన దినం' సందర్భంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖా అధికారిని కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంతో పాటు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.