అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్న సిద్ధం సిద్ధమనే సింహనాదాలు జగనన్న జైత్రయాత్రకు సంకేతాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు. శుక్రవారం గుంటూరు నగరంలోని ఏటుకూరు సమీపంలో జరుగనున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ఊళ్ళకు ఊళ్ళు తరలివస్తున్న తీరుతో, రానున్న ఎన్నికల్లో కూటమి ఓటమి ఖరారైపోయిందని ఆయన స్పష్టం చేశారు.